Hyd Police Checking : భారీగా నగదు..ఆభరణాలు స్వాధీనం
పోలీసుల విస్తృత తనిఖీలు
Hyd Police Checking : హైదరాబాద్ – తెలంగాణలో అక్టోబర్ 9 మధ్యాహ్నం 1 గంట నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం నామ మాత్రంగా మారి పోయింది. ఈసీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేసింది. మరికొందరిపై వేటు వేసింది. ఇంకొందరిని పక్కన పెట్టింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి.
Hyd Police Checking Viral
తాజాగా నిన్న రాత్రి మియాపూర్ పోలీసులు(Hyd Police) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకు వెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు . 27 కేజీల బంగారం, 15 కిలోల వెండితో పాటు నోట్ల కట్టలు బయట పడ్డాయని వెల్లడించారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఓ నగల షాపు నుంచి వీటిని తీసుకు వెళుతున్నట్లు చెప్పారని, వారిని అదుపులోకి తీసుకుని వీటిని స్వాధీనం చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా వీటిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ఖాకీలు. ఇక ఇవాళ జరిపిన తనిఖీల్లో రూ. 14 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
Also Read : Kasani Gnaneshwar : తెలంగాణ ఎన్నికల బరిలో టీడీపీ