Task Force Raids : భారీగా న‌గ‌దు..బంగారం ప‌ట్టివేత‌

హైద‌రాబాద్ లో ఎన్నిక‌ల వేళ సోదాలు

Task Force Raids : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన వెంట‌నే ఖాకీలు రంగంలోకి దిగారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్ 9 నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. అనుమానం వ‌చ్చిన ప్ర‌తి వాహ‌నాన్ని, వ్య‌క్తుల‌ను త‌నిఖీలు చేస్తున్నారు. హోరెత్తిస్తున్నారు.

Task Force Raids Viral

దీంతో ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున న‌గ‌దుతో పాటు బంగారం ప‌ట్టు బ‌డింది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెంత న‌గ‌దు, బంగారం ప‌ట్టుబ‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఒక్క రోజు లోనే ఏకంగా రూ. 20 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు ప‌ట్టు ప‌డింది. టాస్క్ ఫోర్స్(Task Force) త‌నిఖీలు కొన‌సాగిస్తోంది. మూడున్న‌ర కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. ఆబిడ్స్ నిజాం కాలేజీ వ‌ద్ద జ‌రిగిన సోదాల్లో ఏకంగా 7 కిలోల బంగారం, 300 కేజీల వెండి సీజ్ చేశారు.

ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సోదాల‌లో బేగంబ‌జార్ లో రూ. 3 లక్ష‌లు, చైత‌న్య పురిలో రూ. 30 ల‌క్ష‌లు సీజ్ చేశారు. షాద్ న‌గ‌ర్ లో ఉన్న టోల్ ప్లాజాలో రూ. 18 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. వ‌న‌స్థ‌లిపురంలో రూ. 4 ల‌క్ష‌లు, జూబ్లీ హిల్స్ లో రూ. 50 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : CP CV Anand : 16 లోగా గ‌న్స్ ఇవ్వాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!