Hyderabad Best : భాగ్యనగరం అత్యుత్తమం
టాప్ నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్
Hyderabad Best : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం అత్యుత్తమ నగరంగా మరోసారి నిలిచింది. 2023 ఏడాదిలో జీవన నాణ్యత కోసం ఏ నగరం బెటర్ అనే దానిపై మెర్సర్ సంస్థ అధ్యయనం చేసింది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , టెలికాం తదితర రంగాలలో నెంబర్ వన్ గా నిలుస్తూ వచ్చింది.
Hyderabad Best City
తాజాగా చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు పొందు పర్చింది సంస్థ. మొత్తం నగరాలలో హైదరాబాద్(Hyderabad) టాప్ 1గా నిలిచింది. 2వ స్థానంలో పూణె, 3వ స్థానంలో బెంగళూరు నగరం నిలిచింది. ఇక 4వ స్థానంలో తమిళనాడు రాజధాని చెన్నై, 5వ స్థానంలో ముంబై , 6వ స్థానంలో కోల్ కతా, 7వ స్థానంలో న్యూఢిల్లీ నిలవడం విశేషం.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సిటీలలో హైదరాబాద్ చోటు దక్కించు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు నగర వాసులు. ఇదే సమయంలో దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. ఇక్కడే తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. భారీ ఎత్తున ఐటీ ఉద్యోగులు ఇక్కడ కొలువు తీరారు.
రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపారం జోరందుకుంది హైదరాబాద్ నగరంలో. గతంలో ఉన్న ప్రభుత్వం కేవలం ఐటీ జపం చేసింది. తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ అభివృద్ది, సంక్షేమం పేరుతో ముందుకు వెళతామని పేర్కొంది.
Also Read : Konda Surekha : మేడారం జాతరకు నిధులు ఇవ్వండి