Hyderabad City : భాగ్య నగరం విశ్వ నగరం
సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్లే
Hyderabad City : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. అన్ని రంగాలలో దూసుకు పోతున్న ఈ సిటీ ఇప్పుడు ప్రపంచం విస్తు పోయేలా విశ్వ నగరంగా అవతరించింది. దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.
Hyderabad City Development Viral
గతంలో ఉమ్మడి ఏపీ సమయంలో ఈ నగరాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ నగరం. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఈ నగరం వేదికగా పోరాటాన్ని నడిపారు. కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా పర్యటించారు.
రాదని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకు వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా కొలువు తీరారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం, స్టార్టప్ రంగాలలో టాప్ లో కొనసాగుతోంది హైదరాబాద్(Hyderabad). ఇదే సమయంలో గతంలో ధాన్య భాండాగారంగా పంజాబ్ రాష్ట్రం ఉండేది. కానీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల కారణంగా పెద్ద ఎత్తున నీళ్లను ఒడిసి పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చెరువులు, కుంటలు, కాల్వలు, ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు నీళ్లతో కళ కళ లాడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కొలువు తీరి 10 ఏళ్లవుతోంది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఇవాళ భాగ్య నగరం విశ్వ నగరంగా వినుతికెక్కింది.
Also Read : CM KCR Message : స్వప్నం సాకారం రాష్ట్రం పురోగమనం