Hyderabad Top : లావాదేవీల‌లో హైద‌రాబాద్ టాప్

వ‌ర‌ల్డ్ లైన్ వార్షిక నివేదిక‌లో వెల్ల‌డి

Hyderabad Top : ఐటీ, ఫార్మా, రిటైల్ రంగంలో దూసుకు పోతున్న హైద‌రాబాద్(Hyderabad Top) మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. ఆన్ లైన్ లావాదేవీల‌లో హైద‌రాబాద్ టాప్ లో నిలిచింది.

టాప్ 10 న‌గ‌రాల‌ను ప్ర‌క‌టించింది వ‌ర‌ల్డ్ లైన్ వార్షిక నివేదిక‌లో. బ్యాంకుల వినియోగం కంటే డిజిట‌ల్ లావాదేవీల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్ట‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

ఇక భౌతికంగా న‌గ‌దు చెల్లించ‌డం కంటే ఈజీగా సౌక‌ర్యవంతంగా ఉన్న చెల్లింపుల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టడం విశేషం.

పాయింట్ ఆఫ్ సేల్స్ , క్విక్ రెస్పాన్స్ – క్యూ ఆర్ కోడ్స్ వంటి ఆధారిత చెల్లింపులకు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

తాజాగా వ‌ర‌ల్డ్ వైడ్ గా వెల్ల‌డించిన నివేదిక‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. ఇక ఇండియా వార్షిక డిజిట‌ల్ పేమెంట్స్ రిపోర్ట్ -2021 ను అనుస‌రించి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున లావాదేవీలు జ‌రిగాయి.

ఈ లావాదేవీల విష‌యంలో హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్ (Hyderabad Top)లో నిలిస్తే దేశ రాజ‌ధాని ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది. ఎక్కువ‌గా కిరాణా కొట్ల‌లోనే అత్య‌ధికంగా లావాదేవీలు జ‌రిగాయి.

రెస్టారెంట్లు, బ‌ట్ట‌ల దుకాణాలు, మెడికల్ షాపులు, హోట‌ళ్లు, బంగారు దుకాణాలు, గృహ సంబంధ‌మైన వ‌స్తువులు , డిపార్ట్ మెంట్ స్టోర్ల‌కు ఎక్కువ‌గా వెళుతున్నార‌ని నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంది.

ఇక దేశంలో జ‌రుగుతున్న లావాదేవీల‌లో అత్య‌ధికంగా 60 శాతం మేర వాటా వీటికే ఉంద‌ని పేర్కొంది. పండుగ‌ల వేళ ఈ లావాదేవీలు మ‌రింత పెర‌గ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా క్రెడిట్ కార్డుల జారీలు, చెల్లింపులు ఏకంగా క‌రోనా కాలంలో రూ. 100 కోట్లు దాట‌డం విశేషం.

Also Read : స్టార్ట‌ప్ ల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ

Leave A Reply

Your Email Id will not be published!