Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు బిగ్ షాక్ !
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు బిగ్ షాక్ !
Hyderabad Metro Rail: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ మెట్రో రైల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రూ. 59 కు రోజంతా మెట్రోలో ప్రయాణించడానికి ఉపయోగపడే హాలిడే కార్డును కూడా రద్దు చేశారు. ఈ హాలీడే కార్డు ద్వారా రెండో శనివారం, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అపరిమితంగా మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉండేది. అయితే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియడంతో ఈ హాలీడే కార్డు ఫెసిలిటీను నిలిపివేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎండలకుకూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.
Hyderabad Metro Rail Updates
సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు… రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. అయితే, ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Also Read : Lok Sabha Elections : చెన్నై తాంబరం రైల్వే స్టేషన్ లో 4 కోట్ల నగదు పట్టివేత