MLA Tellam Venkata Rao: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ ! కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ !

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ ! కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ !

MLA Tellam Venkata Rao: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఎమ్మెల్యే వెంకట్రావ్‌ హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వెంకట్రావ్ ను సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. కాగా, తెల్లం వెంకట్రావ్‌ కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌. దీనితో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అయ్యింది.

MLA Tellam Venkata Rao Resign

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్‌(MLA Tellam Venkata Rao)… కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిను కలిశారు. దీనితో అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వర్ ​రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. అంతేకాదు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు.

Also Read : Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు బిగ్ షాక్ !

Leave A Reply

Your Email Id will not be published!