Hyderabad Police: వాట్సప్ కోడ్‌తో గచ్చిబౌలి పోలీసుల డెకాయ్ ఆపరేషన్
వాట్సప్ కోడ్‌తో గచ్చిబౌలి పోలీసుల డెకాయ్ ఆపరేషన్
Hyderabad Police : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గంజాయి వినియోగదారులపై ‘ఈగల్’ టీమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు (Hyderabad Police) పేర్కొన్న లొకేషన్‌కి 14 మంది రావడంతో వారిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. వివరాల్లోకి వెళితే…
Hyderabad Police Operation
ఇటీవల మహారాష్ట్రకు చెందిన గంజాయి సరఫరాదారు సందీప్‌ను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ ద్వారా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ‘బచ్చా ఆగయా భాయ్’ వాట్సప్ కోడ్‌తో గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు పోలీసులే మెసేజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రదేశానికి రావాలని పేర్కొన్నారు. దీంతో ఆ లొకేషన్‌కు 14 మంది గంజాయి వినియోగదారులు వచ్చారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. ఓ వ్యక్తి తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో అక్కడికి రావడం గమనార్హం. ఈ 14 మందికి నిర్వహించిన యూరిన్ టెస్టులో పాజిటివ్ రావడంతో వారిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు.
హైదరాబాద్‌లో నిషేధిత ఇంజక్షన్లు స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని ఛత్రినాక పీఎస్ పరిధిలో నిషేధిత ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5లక్షల విలువైన 423 ఇంజక్షన్లను పట్టుకున్నారు. వాటిని విక్రయిస్తున్న నిందితులు మహ్మద్ జుబైర్, వినయ్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు, రూ.9,430 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Shubhanshu Shukla: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం
