Hyderabad Public School :
హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూల్ గా పేరుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్…
ఈ స్కూల్ లో ఒక్కసారి చదువుకునే అవకాశం చిక్కిందంటే చాలు ఇక జీవితంలో సెటిల్ అయినట్లే.
దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అత్యున్నత కంపెనీలు, ఇతర రంగాలలో విజేతలుగా నిలిచిన వారిలో ఎక్కువ మంది ఈ Hyderabad Public School లో , ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న వారే ఉండడం విశేషం.
ఇపుడు ఈ అవకాశం గిరిజన బాల, బాలికలకు దక్కింది.
హెచ్బీసీ నగరంలోని బేగంపేట్, రామంతాపూర్ లలో ఏర్పాటైన స్కూల్స్ లలో 2021-22 సంవత్సరానికి గాను ఒకటవ తరగతిలో ప్రవేశానికి గిరిజన బాల, బాలికల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.
వచ్చే నెల మార్చి 6వ తేదీ సాయంత్రం 4 గంంటల లోపు తమ దరఖాస్తులను కలెక్టరేట్ లోని గిరిజన అభివృద్ధి శాఖ ఆఫీసులో అందజేయాలని కోరారు.
మార్చి 8న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లోని ప్రజావాణి హాలులో డ్రా తీసి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.
ఈ ప్రవేశానికి సంబంధించి మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా వాస్తవ్యులై ఉండాలన్నారు.
పిల్లల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలో అయితే లక్షన్నర, పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే 2 లక్షల లోపు ఉండాలని సూచించారు.
ఆదాయ, నివాస, కులం, జనన ధృవీకరణ పత్రాలు సంబంధిత తహసిల్దార్లు జారీ చేసిన వాటినే స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
2015 నుంచి 2016 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఒక కుటుంబంలో ఒకరే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు.
No comment allowed please