Hyderabad Vinayaka Immersion : జై బోలో గణేశ్ మహరాజ్ కీ
గణపతి బొప్పా మోరియా
Hyderabad Vinayaka Immersion : హైదరాబాద్ – కుల, మతాలకు అతీతంగా హైదరాబాద్ లో కన్నుల పండువగా వినాయకుడి శోభ యాత్ర కొనసాగింది. గణేశుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మహమూద్ అలీలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎక్కడ చూసినా కోలాహలం కనిపించింది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భాగ్యనగరానికి చెందిన పోలీసులు. మహిళలు, పురుషులు పోటా పోటీగా డ్యాన్సులతో హోరెత్తించారు.
Hyderabad Vinayaka Immersion Viral
చిన్నారులు, మహిళలు, పెద్దలు సైతం వినాయక శోభయాత్రలో పాల్గొన్నారు. అన్నింటికంటే నగర సంస్కృతికి దర్పణంగా నిలిచింది ఈ యాత్ర. లక్షలాది మంది జనం, అంతకు మించిన గణనాథులతో హోరెత్తి పోయింది. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలే. అన్నింటిని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. మరికొన్నింటిని నగరానికి దగ్గరలో ఉన్న చెరువులు, జలాశయాలు, కుంటలలో వేశారు.
ఇక హైదరాబాద్(Hyderabad) కు తలమానికంగా నిలుస్తూ వస్తోంది ఖైరతాబాద్ లో ఏర్పాటు చేస్తూ వచ్చిన గణనాథుడు. భారీ విగ్రహం హైలెట్ గా నిలిచింది. కొత్తగా నిర్మించిన సచివాలయం వద్ద వినాయకుడు నిలిచి ఉన్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు హైలెట్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : Minister KTR : రూ.16,650 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ల్యాబ్