P Chidambaram CWC : నాకంటూ వ్యక్తిగత ఎజెండా లేదు
స్పష్టం చేసిన పి. చిదంబరం
P Chidambaram CWC : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకంటూ వ్యక్తిగత ఏజెండా అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. తనకు పార్టీ ముఖ్యమని, అది తనకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని(P Chidambaram CWC) ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ బలంపై సమస్యలు ఉన్నాయని తాను తెలుసుకున్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 85వ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ప్లీనరీలో కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఏఐసీసీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీ సభ్యులలో సగం మందిని ఎన్నుకోవాలని , పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో యువ నాయకుల చేరిక కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతిపక్షాల ఐక్యతపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పి.చిదంబరం(P Chidambaram CWC). ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పార్టీ ఎన్నికల సంఘం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీ ఎన్నికలు జరిగితే తాను పోటీ చేస్తానా లేదా అనే దాని గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. నా వరకు ఎలాంటి అంచనాలు లేవు. అంతే కాదు వ్యక్తిగత ఆశయాలు కూడా లేవన్నారు పి. చిదంబరం.
అయితే యువకులకు ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. పార్టీ విధానం ఏమిటో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు పి. చిదంబరం.
Also Read : ప్రతీకారంతో దాడులు చేయడం లేదు