Ravish Kumar : నా కలానికి పొగరు ఎక్కువ – రవీష్ కుమార్
ప్రముఖ జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్
Ravish Kumar : ఈ దేశంలో భయం అన్నది ఎక్కువగా నెలకొందని , దీనికి ప్రధాన కారణం అన్యాయం రాజ్యాధికారంలో కొనసాగుతోందని సంచలన కామెంట్స్ చేశారు ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్(Ravish Kumar). రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో రవీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఆయన ఎన్డీటీవీ నుంచి వైదొలిగిన తర్వాత స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది సేపటికే లక్షలాది మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ప్రజల కోసం జర్నలిస్ట్ గా పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు రవీష్ కుమార్. మహిళా రెజ్లర్లు బయటకు వచ్చి ఆందోళన చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకునే ధైర్యం లేకుండా పోయిందని ప్రశ్నించారు.
బీబీసీ మోదీ డాక్యుమెంటరీని యూట్యూబ్ లో రాకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో 137 కోట్ల మంది ప్రజలు ఉంటే కేవలం 200 మంది మాత్రమే లాభ పడుతున్నారని ఆవేదన చెందారు రవీష్ కుమార్(Ravish Kumar). నేను ఎంత ఎక్కువగా రాస్తానో నాకు అంత కంటే భయం తగ్గుతుందని చెప్పారు.
ది నేచర్ ఆఫ్ ఫియర్ అనే అంశంపై ప్రసంగించారు. ది ఫ్రీ వాయిస్ , ఎ సిటీ హ్యాపెన్స్ ఇన్ లవ్ , రవిష్పంతి తదితర పుస్తకాలను రాశారు రవీష్ కుమార్. నేను ఎంతగా ఎక్కువగా రాస్తానో ఆరోజు భయం అన్నది తక్కువగా ఉంటుందన్నారు. భయపడే వ్యక్తి నుండి అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే వ్యక్తిగా ఎదిగేందుకు రచన తనకు సహాయ పడిందన్నారు రవీష్ కుమార్.
Also Read : పార్లమెంట్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చేశారు