S Jai Shankar on Modi Call : మోదీ ఫోన్ చేసే దాకా తెలియదు – జై శంకర్
కేబినెట్ పదవి ఆయన చలవేనన్న మంత్రి
S Jai Shankar on Modi Call : మోదీ కేబినెట్ లో 100 శాతం పని తీరును కనబరిచిన ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar). ఆయన విదేశాంగ మంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి భారత్ విదేశాంగ వ్యవహారాలలో వెలిగి పోతోంది. ఆయన దీక్షా దక్షత, నాయకత్వ నైపుణ్యం, గతంలో పలు పదవుల్లో నిర్వహించిన అనుభవం పూర్తిగా భారత దేశానికి మేలు చేకూర్చేలా చేస్తోంది.
ఇదిలా ఉండగా ఏఎన్ఐ ఎడిటర్ ఇన్ చీఫ్ స్మితా ప్రకాశ్ పోడ్ కాస్ట్ తో మాట్లాడారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. తనకు ప్రధానమంత్రి స్వయంగా ఫోన్(S Jai Shankar on Modi Call) చేసి చెప్పేదాకా తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని తెలియదన్నారు. ఇది తాను ఏనాడూ ఊహించ లేదని చెప్పారు.
విదేశీ సేవ నుండి రాజకీయాలకు తన ప్రయాణం గురించి మాట్లాడారు. ఉత్తమ అధికారిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా తన వంతు బాధ్యతలను సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు జై శంకర్. ఆయన జనవరి 2015 నుండి 2018 దాకా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. తాను బ్యూరోక్రాట్ల కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు . చైనా, యుఎస్ సహా కీలకమైన రాయబారి పదవులలో పని చేశారు.
2011లో మరణించిన ఆయన తండ్రి కె.సుబ్రమణ్యం భారత దేశపు అత్యంత ప్రముఖ జాతీయ భద్రతా వ్యూహకర్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1980లో మా తండ్రి డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ. ఇందిరాగాంధీ తిరిగి ఎన్నికైనప్పుడు ఆమె తొలగించిన మొదటి కార్యదర్శి కూడా మా తండ్రిగారేనని చెప్పారు జై శంకర్. తాను విస్తు పోయింది మాత్రం మోదీ నుంచి ఫోన్ రావడమేనని పేర్కొన్నారు.
Also Read : రూప..సింధూరిపై బదిలీ వేటు