IAS Officers Transfers: ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ

ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ

IAS Officers Transfers : ఆంధ్రప్రదేశ్‌ లో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలకు సంబంధించి సీఎస్‌ విజయానంద్‌ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆర్‌పీ సిసోడియాను హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇక రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ‌గా జయలక్ష్మి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

IAS Officers Transfers in AP

అలాగే ఏపీహెచ్ఆర్‌డీ డైరెక్టర్‌ గా కాటమనేని భాస్కర్‌ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం ఐటీ సెక్రటరీగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రేవు ముత్యాలరాజును… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ కమిషనర్‌ గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో ఐఏఎస్ అధికారి కే. మాధవీలతను రైతుబజార్ల సీఈవోగా బదిలీ చేసింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్‌ గా దినేష్ కుమార్ నియమించింది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా నీలకంఠారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది.

Also Read : Crackers Blast: బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం ! 8మంది మృతి !

Leave A Reply

Your Email Id will not be published!