IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు ! వైసీపీ విధేయ ఐఏఎస్ లకు నో పోస్టింగ్ !

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు ! వైసీపీ విధేయ ఐఏఎస్ లకు నో పోస్టింగ్ !

IAS Transfers: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సచివాలయంతో పాటు కీలక శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించారు. దీనిలో భాగంగా భారీగా ఐఏఎస్ ల బదీలీలకు ఆమోద ముద్ర వేసారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి… అప్పటి ప్రతిపక్షంపై కక్ష్యపూరితంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్ లకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఐఏఎస్ ల బదీలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీకు అటాచ్ చేసిన వారిలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను ఉన్నారు.

IAS Transfers – బదిలీ అయిన ఐఏఎస్ లు వీరే !

జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌
పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌
కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌
నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌
ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌
ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి
పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌
గనులశాఖ డైరెక్టర్‌, కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌
ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం
ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌

Also Read : Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?

Leave A Reply

Your Email Id will not be published!