IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు !
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు !
IAS Transfers: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ(IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు.
IAS Transfers – బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు ఇవే !
జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్
జి.జయలక్ష్మి- సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు
కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ
సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి
సురేశ్ కుమార్- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు
జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు
సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు
యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి
హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు
పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి
పి.భాస్కర్- ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు
కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి
గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు
వినయ్‌చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ
వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి
సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ
సి.శ్రీధర్- ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు
జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్
విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్
ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్ బదిలీ
గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్
Also Read : Nadendla Manohar: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ ల పాత్ర – మంత్రి నాదెండ్ల