ICAR Scientist Subbanna Ayyappan: వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్ అనుమానాస్పద మృతి
వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్ అనుమానాస్పద మృతి
Subbanna Ayyappan : కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ సుబ్బణ్ణ అయ్యప్పన్ (78) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణలోని సాయి ఆశ్రమం సమీపంలో కావేరి నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతదేహాన్ని అయ్యప్పన్ గా గుర్తించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం అయ్యప్పన్ మృతదేహాన్ని మైసూరులోని కె.ఆర్.ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ICAR Scientist Subbanna Ayyappan No More…
పద్మశ్రీ పురస్కార గ్రహీత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బణ్ణ అయ్యప్పన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మైసూరులోని అపార్ట్‌మెంట్ లో భార్యతోపాటు నివసిస్తున్న ఆయన ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి అయ్యప్పన్ కనిపించడం లేదు. దీనితో అయ్యప్పన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైసూరులోని విద్యారణ్యపుర పోలీసు స్టేషన్ లో ఈ నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే అనూహ్యంగా అయ్యప్పన్ మృతదేహాన్ని మండ్య జిల్లాలోని కావేరి నది శవమై తేలారు.
Also Read : Ceasefire: 19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు
