ICC Arrest Warrant Putin : పుతిన్ కు అరెస్ట్ వారెంట్
జారీ చేసిన వరల్డ్ కోర్టు
ICC Arrest Warrant Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. పిల్లల హక్కులను కాలరాస్తున్నందుకు గాను పుతిన్ కు ప్రపంచ న్యాయ స్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ జారీ చేసిన రెండు వారెంట్లు బాలల హక్కులకు సంబంధించినవి కావడం విశేషం. ఉక్రెయిన్ పిల్లలను చట్ట విరుద్దంగా బహిష్కరిస్తున్నారనే ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కు(ICC Arrest Warrant Putin) హేగ్ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేయడం కలకలం రేపింది.
ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల ప్రెసిడెంట్ కమిషనర్ ల్యోవా బెలోవాపై కూడా వారెంట్ జారీ చేసినట్లు హేగ్ ఆధారిత కోర్టు వెల్లడించింది. దీనిపై రష్యా ప్రభుత్వం స్పందించింది. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదంటూ స్పష్టం చేసింది. ఇక యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయ స్థానం ప్రకటనను స్వాగతించింది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చారిత్రక నిర్ణయాన్ని ప్రశంసించారు.
చైనీస్ నాయకులు జిన్ పింగ్ మాస్కో పర్యటన , కైవ్ దళాలకు మరిన్ని యుద్ద విమానాలతో సహా ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని గణనీయంగా ప్రభావితం చేసే ఇతర వార్తల తర్వాత కోర్టు షాక్ నోటీసు ఇచ్చింది. కైవ్ ప్రకారం ఫిబ్రవరి 24, 2022 దండయాత్ర నుండి 16,000 మందికి పైగా ఉక్రెయిన్ పిల్లలు రష్యాతో బహిష్కరించబడ్డారు. చాలా సంస్థలలో పిల్లలు తలదాచుకున్నారు.
ఈ సందర్భంగా ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మాట్లాడారు. పుతిన్ ఇప్పుడు కోర్టులోని 120 కంటే ఎక్కువ సభ్య దేశాలలో ఏదైనా అడుగు పెడితే అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
Also Read : గీత దాటినా గౌరవం తప్పదు
