ICC ODI Rankings : వ‌న్డే ర్యాంకింగ్స్ లో భార‌త్ టాప్

శ్రీ‌లంక‌..కీవీస్ పై వ‌న్డే సీరీస్

ICC ODI Rankings : కొత్త ఏడాది 2023లో భార‌త్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా వ‌న్డే సీరీస్ లు కైవ‌సం చేసుకోవ‌డంతో వ‌న్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ లోకి చేరింది.

స్వ‌దేశంలో శ్రీ‌లంక‌తో , న్యూజిలాండ్ తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ ల‌ను క్లీన్ స్వీప్ చేసింది భార‌త్ జ‌ట్టు(ICC ODI Rankings) . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటింది. భారీ ఎత్తున స్కోర్లు చేస్తూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

శ్రీ‌లంకతో జ‌రిగిన సీరీస్ లో 3-0 తేడాతో గెలుపొంద‌గా తాజాగా న్యూజిలాండ్ తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ ను కూడా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎగ బాకి నెంబ‌ర్ వ‌న్ కు చేరుకుంది.

ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి వ‌న్డేలో 12 ప‌రుగుల తేడాతో గెలిస్తే రాయ్ పూర్ లో జ‌రిగిన వ‌న్డేలో 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్ లో 90 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సాధించింది.

114 రేటింగ్ తో టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్ప‌టి దాకా భార‌త్ 44 మ్యాచ్ ల్లో ఆడింది. 5010 పాయింట్లు సాధించింది. 114 రేటింగ్ తో మొద‌టి స్థానం ద‌క్కించుకుంది.

ఇక కేవ‌లం ఒక్క పాయింట్ తేడాతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆ జ‌ట్టు 113 పాయింట్ల‌తో స‌రి పెట్టుకుంది. భార‌త్ చేతిలో క్లీన్ స్వీప్ కు గురైన కీవీస్ మూడు పాయింట్ల తేడాతో త‌న స్థానాన్ని కోల్పోయింది. 111 పాయింట్ల‌తో మూడో స్థానంతో స‌రి పెట్టుకుంది.

Also Read : క‌దం తొక్క‌న గిల్ చెల‌రేగిన రోహిత్

Leave A Reply

Your Email Id will not be published!