Basara IIIT Protest : డిమాండ్స్ తీర్చే దాకా పోరాటం ఆగదు
స్పష్టం చేసిన బాసర త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్
Basara IIIT Protest : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేంత దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు బాసర త్రిబుల్ ఐఐటీ(Basara IIIT Protest) విద్యార్థులు. విద్యార్థుల తరపున కొందరు స్టూడెంట్స్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇవ్వడమే కాదు రాత పూర్వకంగా ఇస్తేనే తాము ఒప్పుకుంటామని లేదంటే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ విద్యా సంస్థకు రావాల్సిన నిధులను మాత్రమే మంజూరు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
డైరెక్టర్ ను ఏ ప్రాతిపదికన నియమించారో వీసీని కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తోందంటూ వాపోయారు.
తమ డిమాండ్లను సిల్లీగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొనడాన్ని తప్పు పట్టారు. ఈరోజు వరకు డైరెక్టర్ తమ గురించి పట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ్టితో విద్యార్థులు చేస్తున్న ఆందళన ఏడో రోజుకు చేరింది. తమవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. తాము అడిగిన 12 డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నుంచి కచ్చితమైన హామీ ఇస్తే తప్ప నిరసన విరమిస్తామన్నారు. ల్యాప్ టాప్ లు , యూనిఫాంలు, లైబ్రరీలో పుస్తకాల ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ గా అధ్యాపకుల్ని నియమించాలని కోరారు.
వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. ఎప్పటి లోగా మిగతా సమస్యలు పరిష్కరిస్తారో చెప్పాలన్నారు.
దీంతో తాజాగా విద్యా మంత్రి సమీక్ష చేపట్టారు. పోలీసుల భారీగా మోహరింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Also Read : 10,105 జాబ్స్ భర్తీకి ఆర్థిక శాఖ లైన్ క్లియర్