Basara IIIT Protest : విద్యార్థుల రోదన మిన్నంటిన నిరసన
రోడ్డెక్కిన బాసర విద్యార్థుల ఆందోళన
Basara IIIT Protest : విద్యా రంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇది పరాకాష్ట. రాజకీయాలకు వేదికగా విద్యా సంస్థలు ఎప్పుడైతే మారి పోయాయో విద్య పక్కదారి పడుతుంది.
విద్యార్థుల సంక్షేమం గాలిలో దీపం అవుతుంది. ఇది నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐఐటీ(Basara IIIT Protest) నిరూపించింది. ఇప్పటి వరకు వీసీని నియమించ లేదు. గతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ను ఇన్ చార్జ్ గా నియమించారు.
నిధులు లేవు. నియామకాలు అసలే లేవు. ఎక్కడ బంగారు తెలంగాణ. ఒకరు కాదు ఇద్దరు కాదు బాసర ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. నిరసన వ్యక్తం చేశారు.
రోదనలు, ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లి పోయింది ఆ ప్రాంతమంతా. బాధ్యత కలిగిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇదంతా సిల్లీ థింగ్ అంటూ కామెంట్ చేయడం విద్యా సంస్థ పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.
దేశ వ్యాప్తంగా బాసర ఐఐటీ(Basara IIIT Protest) విద్యార్థుల ఆందోళన చర్చకు దారి తీసింది. కనీస సౌకర్యాలు లేవని, ఫ్యాకల్టీ లేకుండా పోయిందని, భోజనం సరిగా పెట్టడం లేదంటూ వాపోయారు.
తాము మీ విద్యార్థులం కాదా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. తమకు కలెక్టర్ పై, విద్యా శాఖ మంత్రి పై నమ్మకం లేదంటూ కుండ బద్దలు కొట్టారు. సీఎం,
కేటీఆర్ స్పందించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేయడం చర్చకు దారి తీసింది. వర్షం పడుతున్నా విద్యార్థులు గొడుగులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థులు 12 డిమాండ్లు ముందుంచారు.
ఇందులో మూడు తీరుస్తామంటూ కలెక్టర్ అలీ తెలిపారు. అందుకు స్టూడెంట్స్ ఒప్పుకోలేదు.
Also Read : అగ్నిపథ్ స్కీం’పై యువత ఆగ్రహం