IIT Madras Top : ఐఐటీ మద్రాస్..ఐఐఎస్ బెంగళూరు టాప్
2022కి సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ డిక్లేర్
IIT Madras Top : కేంద్ర విద్యా శాఖ 2022కి సంబంధించి టాప్ ర్యాంక్స్ లను విడుదల చేసింది. మరోసారి మద్రాస్ ఐఐటీ సత్తా చాటింది. ఇండియాలోని ఐఐటీలలో మద్రాస్ ఐఐటీ నెంబర్ వన్ గా(IIT Madras Top) నిలిచింది.
ఇక యూనివర్శిటీల పరంగా చూస్తే ఐఐఎస్ బెంగళూరు యూనివర్శిటీ టాప్ లోకి చేరింది. ఓవరాల్ గా ఇండియా ర్యాంకింగ్స్ లో ఐఐటీలు దుమ్ము రేపాయి.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రెండో ప్లేస్ లో నిలిచింది. ఐఐటీ బాంబే మూడో స్థానంతో సరి పెట్టుకుంది.
శుక్రవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్ తయారు చేసిన లిస్టును విడుదల చేశారు.
టాప్ 10 స్థానాలకు గాను 6 స్థానాలలో పూర్తిగా ఐఐటీలే కైవసం(IIT Madras Top) చేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా ఈసారి ఢిల్లీలోని ఎయిమ్స్ 9వ స్థానంలోకి చేరడం విశేషం. గత సంవత్సరంలో ఈ ఎయిమ్స్ లిస్టులో లేదు.
ఇదే దేశ రాజధానికి చెందిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ , జామియా మిలియా ఇస్లామియా వర్సీటీలు రెండు, మూడో ర్యాంకులు సాధించాయి.
ప్రతి ఏడాది ర్యాంకులను దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , ఫార్మసీ, కాలేజీ , మెడికల్ , ఆర్కిటెక్చర్ , లా , డెంటల్ , రీసెర్చ్ క్యాటగిరీలలో ప్రకటిస్తారు.
ఫార్మసీలో హైదరాబాద్ కు చెందిన కాలేజీకి చోటు దక్కింది. లా కాలేజీల్లో పూణె లోని సింబయాసిస్ టాప్ లో చేరింది. ఇక బెంగళూరు, ఢిల్లీ లా కాలేజీలు టాప్ లో నిలిచాయి.
Also Read : బీటెక్ విద్యార్థులకు ఫీజుల మోత