Dharmendra Pradhan : ఐఐటీయన్లు కంపెనీలు స్థాపించాలి
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan : టెక్నాలజీ మారుతోంది. ప్రస్తుతం దేశంలోని ఐఐటీయన్ల (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ )కు భారీ ఎత్తున డిమాండ్ ఉంటోంది. ఎందుకంటే ప్రపంచంలోని టాప్ ఐటీ , ఇతర దిగ్గజ కంపెనీలలో ఈ సంస్థలలో చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారు.
వారి మేధో సంపత్తి, ఆవిష్కరణలు కేవలం ఒకే కంపెనీకో లేదా వేతనాలు పొందే ఉద్యోగులుగా ఉండ కూడదని, పారిశ్రామికవేత్తలుగా, భావి తరాలకు ఉపాధి కల్పించేలా తమను తాము ప్రూవ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్(Dharmendra Pradhan).
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ను ఆయన సందర్శించారు. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐఐటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించారు.
అనంతరం బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి.
ఐఐటీ ఆడిటోరియంలో మంత్రి సమక్షంలో ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ) ఐఐటీ హైదరాబాద్ కలిసి ని చేసేందుకు కుదుర్చుకున్న ఎంవోయూపై వీసి సురేష్ కుమార్ , ఐఐటీ డైరెక్టర్ మూర్తి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు.
ఇందులో ప్రత్యేకంగా ఐఐటీల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు ధర్మేంద్ర ప్రదాన్(Dharmendra Pradhan).
Also Read : టార్గెట్ ముఖ్యం లేక పోతే కష్టం – జుకెర్ బర్గ్