Ilaiyaraaja: మద్రాస్ ఐఐటీలో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ ఏర్పాటు !
మద్రాస్ ఐఐటీలో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ ఏర్పాటు !
Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రోగా పిలువబడే ఇళయరాజా పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లో మాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సోమవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐఐటీఎం డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ సంగీతం గురించి తెలుసుకోవడానికి లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైందని, తద్వారా ఎక్కువ పరిశోధనలు చేయగలిగే వీలుందని పేర్కొన్నారు. అనంతరం ఇళయరాజా, కామకోటి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు.
Ilaiyaraaja Music
ఈ సందర్భంగా ఇళయరాజా పాత రోజులను గుర్తు చేసుకుంటూ… మద్రాస్ కు సోదరుడితో చిన్నప్పుడు వచ్చానని, ఇప్పటివరకూ ఎవరి వద్దా ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదన్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో ఎవరైనా రాణించవచ్చని యువతకు సూచించారు. మరోవైపు ‘స్పిక్మాకే’ పేరిట తొమ్మిదో అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం ఐఐటీఎంలో ప్రారంభమయ్యాయి. ఇవి వారం రోజులపాటు జరగనున్నాయి.
జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించిన ఇళయరాజా(Ilaiyaraaja)… భారతదేశపు ప్రముఖ సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేయడంతో ఇళయరాజా కీలక పాత్ర పోషించారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా(Ilaiyaraaja) నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత “బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా”ని వాడేవారు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి “సింఫనీ”ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే.
జనాలకు ఈయన “మేస్ట్రో ” అని సుపరిచితం. 2003లో న్యూస్ ఛానల్ “బీ.బీ.సి” నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం “దళపతి” సినిమాలో “అరె చిలకమ్మా” పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా”లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2018లో భారత ప్రభుత్వం ఈయనను “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరిచింది. బిజెపి ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది.
Also Read : Telangana Rains: ఆసుపత్రి ఆవరణలో కూలిన చెట్టు ! భార్య చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మృతి !