Khushboo Jain : ఇంపాక్ట్ గురూ దేశంలోని క్రౌండ్ ఫండింగ్ స్టార్టప్ లలో టాప్ లో ఉంది. ఎవరికైనా ఆపద వచ్చిందంటే అప్పు కోసం వెళతాం. అక్కడ పుట్టక పోతే ఎలా.
మనకు సంబంధించిన సమస్య, దానికి కావాల్సిన సాయం ఏదైనా ఇంపాక్ట్ గురూలో పోస్ట్ చేస్తే ఔత్సాహికులు, మానవతావాదులు స్పందిస్తారు.
తోచిన మేర సాయం చేస్తారు. ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్ కదూ. ఇంపాక్ట్ గురూ తో పాటు కూ-ను కూడా స్థాపించారు ఖుష్బూ జైన్(Khushboo Jain) . ఆమె మహిళా సాధికారతకు దర్పణంగా నిలుస్తున్నారు.
మార్కెటింగ్ విభాగం, కమ్యూనికేషన్ , డిజైన్ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఖుష్బూ మొదటి నుంచి విద్యాధికురాలిగా ఉన్నారు. పేరు పొందారు కూడా. ముంబై లోని సిడెన్ హామ్ కాలేజ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ చదివింది.
వెలింగ్ కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి మార్కెటింగ్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అంతే కాకుండా లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ లో సైతం పీజీ పూర్తి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వ్యక్తులలో ఒకరిగా ఖుష్బూ జైన్ నిలిచారు. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలలో చోటు సంపాదించింది.
2019 ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ నీతి ఆయోగ్ , యునైటెడ్ నేషన్స్ లో టాప్ 15 మంది మహిళా విజేతలలో ఖుష్బూ జైన్ కూడా ఉన్నారు.
ఇంపాక్ట్ గురు అనేది మంచి కోసం సాంకేతితను ఉపయోగించే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫారమ్. దీనిని 2015లో అప్పటి కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రారంభించారు. ఇంపాక్ట్ గురు ఎన్జీఓలు, సామాజిక సంస్థల కోసం రూ. 150 కోట్ల నిధులు సేకరించింది.
Also Read : ఈ కామర్స్ లో నైకా సంచలనం