Imran Khan Bail : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై హై డ్రామా
ప్రస్తుతానికి అరెస్ట్ ముప్పు తప్పినట్టే
Imran Khan Bail : ఎట్టకేలకు అరెస్ట్ ముప్పు నుంచి బయట పడ్డారు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఆయనను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. కానీ చివరకు ఇమ్రాన్ ఖాన్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు.
ప్రస్తుతానికి అరెస్ట్ చేయక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది నిషేధిత నిధుల కేసులో 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) అనర్హుడిగా ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.
హైడ్రామా మధ్య ఇమ్రాన్ ఖాన్(Imran Khan Bail) కోర్టు ముందు హాజరయ్యారు. ఆయను ముందస్తు అరెస్ట్ చేయకుండా న్యాయమూర్తి ఇమ్రాన్ ఖాన్ కు మార్చి 3 వరకు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో పీటీఐ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తారని ముందే తెలసుకున్న పార్టీ శ్రేణులు లాహోర్ కోర్టు ముందు భారీగా హాజరయ్యారు. ఈ కేసులో తన ప్రొటెక్టివ్ బెయిల్ పిటిషన్ పై విచారణకు హాజరు కావాలని జస్టిస్ తారఖ్ సలీమ్ షేక్ ఇమ్రాన్ ఖాన్ ను(Imran Khan Bail) ఆదేశించారు.
జస్టిస్ అలీ బకర్ నజాఫీ నేతృత్వంలోని ఎల్హెచ్సికి చెందిన ద్విసభ్య ధర్మాసనం పీటీఐ చైర్మన్ కు రక్షణాత్మక బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ కాలుకు గాయమైంది. ఆయన కోలుకునేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. దీనిని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Also Read : మా స్నేహం బలీయమైనది