Imran Khan : ఉప ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ ఖాన్ హ‌వా

అత్య‌ధిక స్థానాల్లో పార్టీ విజ‌యం

Imran Khan : పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ హవా త‌గ్గ‌డం లేదు. ఆయ‌న చ‌రిష్మా కొన‌సాగుతోంది. తాజాగా పాకిస్తాన్ లోని ఎనిమిది స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ఏడు స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేస్తే ఆరు స్థానాల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు.

పాక్ ప్ర‌భుత్వానికి ఇది చెంప పెట్టుగా పేర్కొన్నారు పీటీఐ చీఫ్ , మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan). అంతే కాకుండా ఆయ‌న గ‌త కొంత కాలం నుంచీ దేశంలో ముందస్తు ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా విస్తృతంగా ర్యాలీలు చేప‌ట్టారు.

మొత్తం ఎనిమిది స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగితే ఆరు స్థానాలో ఇమ్రాన్ ఖాన్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేయ‌గా అధికార కూట‌మికి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మిగిలిన రెండు స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. మాజీ నాయ‌కుడు ఇమ్రాన్ ఖాన్ గెలిచిన ఒక సీటుకు త‌ప్ప మిగిలిన అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. 220 మిలియ‌న్ల‌కు పైగా ఉన్న దేశంలో ఇమ్రాన్ ఖాన్ కు జ‌నాద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ ఫ‌లితాలు చెబుతున్నాయి. గ‌త ఏప్రిల్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుండి దూర‌మ‌య్యారు.

ఆ త‌ర్వాత ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. చివ‌ర‌కు తాను దిగి పోవ‌డానికి అమెరికానే కార‌ణ‌మ‌ని ఆరోపించాడు. ఆపై భార‌త్ ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ విజ‌యంతో ఖాన్(Imran Khan) శిబిరంలో ఆనందం వ్య‌క్తం కాగా అధికార కూట‌మిలో నిరాశ అలుముకుంది.

Also Read : భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ‘స్వామి’ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!