#RamGopalVarma : వ‌ర్మ డ‌బ్బ‌లెగ్గొట్టాడంటూ ఆరోప‌ణ‌ల ప‌రంప‌ర‌

Ram Gopal Varma : నిత్యం వివాదాల తో స‌హావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ఎక్కడుందో అక్కడ వర్మ కూడా ఉంటాడన్న పేరు తెచ్చుకున్నాడ‌న‌టంతో సందేహంలేదు.

Ram Gopal Varma : నిత్యం వివాదాల తో స‌హావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ఎక్కడుందో అక్కడ వర్మ కూడా ఉంటాడన్న పేరు తెచ్చుకున్నాడ‌న‌టంతో సందేహంలేదు. తాజాగా తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు డబ్బులు చెల్లించలేదని ఆరోపణలు వెల్లువ‌గా వినిపిస్తున్నాయి.

సినిమాల కోసం పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పాటు మరికొందరికి అసలు జీతాలే ఇవ్వలేదని, ప‌లు ప‌ర్యాయాలు అడిగినా డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నాడంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియా సినీ ఎంప్లాయూస్ ఆరోపిస్తూ, ఇకపై ఆర్జీవీతో పని చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

క‌రోనా స‌మ‌యంలోనూ ప‌లు చిత్రాలకు ప‌నిచేసినా, ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డుతున్న వారంద‌రికీ డబ్బులు చెల్లించమని కోరుతూ ఫెడరేషన్ వర్మకు సెప్టెంబర్‌ 17 నుంచి లేఖలు పంపుతూనే ఉన్నా వ‌ర్మ నేటికీ స్పందించ ‌లేద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రి ఈ విషయంపై వర్మ ఎలా స్పందిస్తాడోవేచి చూడాలి.

No comment allowed please