#Zomato : ఫుడ్ స‌ర్వీస్ లో జొమాటో దూకుడు

బెట‌ర్ స‌ర్వీస్‌తో భారీ ఆదాయం

Zomato: మన దేశంలోని యువత అమెరికా జపం చేస్తుంటే, యుఎస్ కు చెందిన దిగ్గజ కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ కామర్స్ రంగం రోజు రోజుకు విస్తరిస్తోంది. డాలర్ల పంట పండిస్తోంది. అమెజాన్ , వాల్ మార్ట్ , తదితర కంపెనీలన్నీ భారత్ దేశంలోనే కాసులు కొల్లగొట్టొచ్చంటూ దీనికే ప్రయారిటీ ఇస్తున్నాయి. మన ప్రబుద్ధులు మాత్రం దినమంతా అమెరికా అంటూ పలవరిస్తున్నారు .

జనాభా అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వీరి అవసరాలకు సరిపడా వస్తువులు, తిండి క్వింటాళ్ల లెక్క‌న కావాల్సి వ‌స్తుంది. లాజిస్టిక్ రంగం కోట్లు కురిపిస్తోంది. విస్తరిస్తున్న సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసు కోవడంతో ఈ రంగంలో స్టార్ట‌ప్‌లు పుట్టుకు వ‌స్తున్నాయి.వీటిలో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని ప్రారంభంలోనే నిలిచి పోయాయి. ఫుడ్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

నగరం విస్తరించడం, ఉద్యోగ రీత్యా, వ్యాపార పరంగా ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లడం తో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ప్రజల అవసరాలు పెరిగాయి. ఐటి రంగం లో భారీ వేతనాలు పొందడం కూడా మార్కెట్ లో కనీస అవసరాలు తీర్చుకునేందుకు వినియోగదారులు భారీగా ఖర్చు చేస్తున్నారు. కోట్లాది మంది ఆఫ్ లైన్ లో కంటే ఆన్ లైన్ లో నే కొనుగోలు చేస్తున్నారు.

అంతే కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిలో తిండి పదార్థాలు ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. కేవలం గంట లోపే డోర్ డెలివరీ అవుతున్నాయి ఐటంలు. ఈ సెక్టార్ లో ఇండియాలో జొమాటో రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. తన వ్యాపారాన్ని చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో సైతం ఫుడ్ కు సంబంధించి ఐటమ్స్ ను డెలివరీ చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ..పెను మార్పులు చేసింది.

రోజుకు నాలుగు నగరాలను అనుసంధానం చేసుకుంటూ వెళుతోంది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా నగరాలను రీచ్ అయ్యింది. అంటే ప్రతి రోజు ఆర్డ‌ర్లు తీసు కోవడం , వాటిని ఆయా ప్రాంతాలలో బుక్ చేసిన వారికి ఇవ్వడం. ఈ వ్యాపారం కాసులు కురిపిస్తోంది జొమాటోకు. రాబోయే రోజుల్లో మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు ఫుడ్ డెలివరీ సీయివో మోహిత్ గుప్తా. విజ‌యం ఎక్క‌డో లేదు అది క‌ష్ట‌ప‌డ‌టంలో..భిన్నంగా ఆలోచించ‌డంలో ఉంది క‌దూ.

No comment allowed please