Tax Notice: కూలీకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు ! 314 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు !
కూలీకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు ! 314 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు !
Tax Notice : ఆదాయపుపన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాయానికి అనుగుణంగా పన్ను కడితే ఫరావాలేదు. కాని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తే… వచ్చిన ఆదాయం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అయితే సాంకేతిక కారణాలవల్ల ఒక్కోసారి… రోజువారీ కూలీలకు కూడా కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీసులు(Tax Notice) వచ్చిన సందర్భాలు చూస్తున్నాము. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ లోని బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే రోజు వారీ కూలీకు ఎదురయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. దీనితో ఆ నోటీసులు చూసి అతడి కుటుంబం అవాక్కయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Tax Notice to Labor
మధ్య ప్రదేశ్(Madhya Pradesh) లోని బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ పండిత్ రావు కోహద్ దినసరి కూలీగా పని చేసుకుని జీవితం సాగిస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి రోజు సంపాదన 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ప్రతి రోజూ కూలీకి పోతే గానీ అతడి ఇళ్లు గడవదు. అలాంటి అతడికి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అది కూడా 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆ నోటీసుల్లో ఉంది. ఆ నోటీసులో ఉన్నది ఏంటో తెలియగానే అతడు షాక్ అయ్యాడు. తాను జీవితాంతం కష్టపడ్డా కోటి రూపాయలు సంపాదించలేను… అలాంటిది అంత పన్ను కట్టమని నోటీసు రావటం ఏంటి అనుకుని బాధలో మునిగిపోయాడు. నోటీసుల దెబ్బకు కుటుంబం మొత్తం ఆందోళన చెందుతోంది.
అయితే ఈ నోటీసుల వల్ల ఆ కుటుంబం అంతా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. ఇక్కడ దారుణం ఏంటంటే.. చంద్రశేఖర్‌కు గుండె జబ్బు ఉంది. నోటీసుల ఒత్తిడి తట్టుకోలేక అతడు కూడా అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. అందరూ ఆస్పత్రుల పాలుకావటంతో ఆర్థికంగా మరింత చితికిపోయాడు. ఈ దారుణానికంతటికీ కారణం ఓ లాండ్… ఆ లాండ్ చంద్రశేఖర్ పేరు మీద ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ పొరపడింది. నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెరిఫికేషన్ మొదలుపెట్టింది. ఆ లాండ్ అతడి పేరు మీద లేదని తేల్చింది. ఇదే విషయాన్ని ఆదాయ పన్ను శాఖకు పంపింది. దీనితో చంద్రశేఖర్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
Also Read : Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో మద్యం త్రాగిన వ్యక్తి ! వైరల్ గా మారిన వీడియో !