IND vs AUS 4th Test : నాలుగో టెస్టు డ్రా..భార‌త్ దే సీరీస్

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు టీమిండియా

India Australia 4th Test : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో భార‌త్ ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన నాలుగు టెస్టుల్లో 2-1 తేడాతో టెస్టు సీరీస్ టీమిండియా వ‌శ‌మైంది. దీంతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు భార‌త్ చేరుకుంది. చేరుకుంటుందా లేదా అన్న మీమాంస తొల‌గి పోయింది. శ్రీ‌లంక‌ను న్యూజిలాండ్ ఓడించ‌డంతో భార‌త్ కు అడ్డు తొల‌గి పోయింది. ఇక నాగ్ పూర్ , న్యూ ఢిల్లీలో జ‌రిగిన టెస్టుల‌లో భార‌త్ విజ‌యం సాధించింది.

ఇండోర్ లో జ‌రిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది ఆస్ట్రేలియా. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ 480 ర‌న్స్ చేసింది. ఆసిస్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా , కామెరాన్ సెంచ‌రీల మోత మోగించింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు భారీ స్కోర్ (India Australia 4th Test) చేసింది. విరాట్ కోహ్లీ , శుభ్ మ‌న్ గిల్ సెంచ‌రీల‌తో మోత మోగించారు. ఈ సెంచ‌రీతో త‌న కెరీర్ లో 28వ‌ది విరాట్ కోహ్లీ. త‌న కెరీర్ లో 75 సెంచ‌రీలు సాధించాడు.

ఎటూ ఫ‌లితం తేలక పోవ‌డంతో ఇరు జ‌ట్ల కెప్టెన్లు కొంత స‌మ‌యం ముందే డ్రాగా ముగిసేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఓకే చెప్పారు అంపైర్లు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 175 ర‌న్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 90 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. ల‌బుషేన్ 63 ప‌రుగుల‌తో దుమ్ము రేపాడు. స్మిత్ 10 ర‌న్స్ తో నాటౌట్ గా ఉన్నాడు. అంత‌కు ముందు టీమిండియా 571 ర‌న్స్ చేసి ముగించింది. 91 ప‌రుగుల ఆధిక్యంతో బ‌రిలోకి దిగిన ఆసిస్ భారీ స్కోర్ దిశ‌గా ప‌రుగులు తీయ‌డంతో డ్రా కాక త‌ప్ప‌లేదు.

Also Read : ఆస్కార్ వేదిక‌పై మెరిసిన దీపికా

Leave A Reply

Your Email Id will not be published!