IND vs BAN 1st Test : బంగ్లా పోరాటం హసన్ శతకం
4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు
IND vs BAN 1st Test : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. భారీ లక్ష్యాన్ని ముందుంచింది భారత్ జట్టు. అయినా ఆతిథ్య జట్టు సాధ్యమైనంత వరకు పోరాడేందుకు ప్రయత్నం చేస్తోంది. టెస్టుల్లోనే అరంగ్రేటం చేసిన జకీర్ హసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నించాడు. ఆట ప్రారంభించిన రెండో ఇన్నింగ్స్ లో ప్రారంభంలో వికెట్లు కోల్పోకుండా మెల మెల్లగా పరుగులు చేస్తూ వచ్చింది బంగ్లాదేశ్(IND vs BAN 1st Test). భారత బౌలర్లను ఎదుర్కొంటూ అవసరమైన సమయంలో పరుగులు చేస్తూ వచ్చారు.
టెస్టు మ్యాచ్ లో భాగంగా నాలుగో రోజులో జకీర్ హసన్ అద్భుతంగా ఆడాడు. ఏకంగా 100 పరుగులు చేసి విస్తు పోయేలా చేశాడు భారత బౌలర్లను. చివరకు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. సెంచరీ చేసిన వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. అప్పటి వరకు చాలా ఓపికతో టార్గెట్ ను ఛేదించేందుకు ప్రయత్నం చేశాడు హసన్.
అంతకు ముందు భారత జట్టు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. మొదట టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 404 రన్స్ కే ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అంటే ఇంకా 170 పరుగులు చేస్తే బంగ్లా దేశ్ గెలిచేందుకు అవకాశం ఉంది.
Also Read : సాకర్ సమరం ఫైనల్ కు సిద్దం