IND vs WI : భారత , వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ కోల్ కతా వేదికగా మూడో వన్డే మ్యాచ్ (IND vs WI )కొనసాగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలోనూ భారత జట్టు గెలుపొందింది.
ఇక రెండో మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. ఆఖరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపొంది భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేపట్టడంతో విజయం సునాయసంగా గెలుపొందింది. వెస్టిండీస్ ఈ ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి పోయిన పరువు నిలబెట్టు కోవాలని ప్రయత్నం చేస్తోంది. నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు.
ఇక ఈ మూడో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ను దూరంగా పెట్టారు. వీరి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ , కోహ్లీ స్థానంలో(IND vs WI )శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కనుంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చహర్ , భువనేశ్వర్ లలో ఒకరిని పక్కన పెట్టి మహమ్మద్ సిరాజ్ లేదా అవేశ్ ఖాన్ కు ఛాన్స్ ఇచ్చింది. ఈ సీరీస్ పూర్తయిన వెంటనే శ్రీలంక సీరీస్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పటికే బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇక పూర్తి స్థాయిలో రోహిత్ శర్మకు అన్ని ఫార్మాట్ ల కు కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత ఏడున్నర ఏళ్లుగా భారత జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ తప్పుకున్నాడు.
అతడి స్థానంలో రోహిత్ కు పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ కు బదులు జస్ ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక రోహిత్ కు కితాబు ఇచ్చాడు భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.
Also Read : నిరాశ పరిచిన ఛతేశ్వర్ పుజారా