India Bans Wheat : గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం
ధరలు తగ్గించేందుకేనని ప్రభుత్వ ప్రకటన
India Bans Wheat : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ తక్షణమే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది(India Bans Wheat).
నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ లో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేసిన ఎగుమతి షిప్ మెంట్ లు మాత్రమే గోధుమలు ఎగుమతి చేసేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలపై ఎగుమతులను అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) జారీ చేసిన నోటిఫికేషన్ లో వెల్లడించింది.
దేశానికి సంబంధించి ఆహార భద్రతను నిర్వహించేందుకు , పొరుగు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్ధతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెల చివరలో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుండి నల్ల సముద్రం ప్రాంతం నుండి ఎగుమతులు పడి పోయాయి. దీంతో భారత దేశంలో పండించిన గోధుమలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ప్రపంచ దేశాల నుంచి గోధుమలు కావాలని ఇండియాను కోరుతుండడం దేశ అవసరాలకు సరిపడా నిల్వలకు ప్రమాదం ఏర్పడనుందని భారత ప్రభుత్వం గ్రహించింది(India Bans Wheat).
ఇదిలా ఉండగా ప్రపంచంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద గోధుమ ఉత్పత్తి దారుగా భారత్ ఉంది. ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా గోధుమ పంటకు నష్టం ఏర్పడింది.
ఏప్రిల్ 7.79 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా ఒత్తిడిలో ఉంది.
Also Read : ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలి