Tim Cook : చైనా కంటే భారత్ కీలకం – టిమ్ కుక్
యాపిల్ సిఇఓ షాకింగ్ కామెంట్స్
Tim Cook : ఆపిల్ సిఇఓ టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్పత్తుల తయారీ పరంగా చూస్తే చైనా కంటే భారత్ అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా పేర్కొన్నారు టిమ్ కుక్. ఆయన ప్రత్యేకించి 20 సార్లు భారత్ ను ప్రస్తావించారు. ఐ ఫోన్ తయారీకి సంబంధించి భారత్ కీలకమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భారత దేశంలో మార్చి త్రైమాసికంలో కంపెనీ రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. ఇటీవలే భారత్ లో ఆపిల్ రెండు స్టోర్లను ప్రారంభించింది. ఒకటి ముంబై వేదికగా రెండోది ఢిల్లీలో స్టార్ట్ చేశారు ఆపిల్ సిఇఓ టిమ్ కుక్(Tim Cook) .
ప్రపంచ మార్కెట్ పరంగా చూస్తే ఇప్పుడు భారత్ కీలకంగా మారనుందన్నారు. ఆపిల్ 1.4 బిలియన్ల దేశంలో వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు టిమ్ కుక్. స్మార్ట్ ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని స్పష్టం చేశారు. కంపెనీ పరంగా చూస్తే ఆదాయం పెరగడం ఒకింత ఆనందం కలిగించే అంశమన్నారు సిఇఓ. ఆపిల్ మార్చి నుండి సంవత్సరంలో దాదాపు $6 బిలియన్ల అమ్మకాలను పోస్ట్ చేసినట్లు నివేదించడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు.
ఇదిలా ఉండగా బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఆపిల్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను ఎంచుకున్నారు సిఇఓ టిమ్ కుక్(Tim Cook) .
Also Read : కలుద్దాం ముందుకు సాగుదాం – గ్యాంగ్