India Post Jobs : పోస్టాఫీసుల్లో భారీగా కొలువుల జాత‌ర

దేశ వ్యాప్తంగా 98 వేల పోస్టులు

India Post Jobs : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించిన‌ట్లు గానే కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు శ‌ర‌వేగంగా వ‌స్తున్నాయి. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే ప్ర‌ధాన పార్టీలు రాజ‌కీయ ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే కేంద్రం అగ్నిప‌థ్ స్కీం తీసుకు వ‌చ్చింది. అన్ని రంగాల‌లో కాంట్రాక్టు ప‌ద్ద‌తిన భ‌ర్తీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీనికి కూడా ఊహించ‌ని రీతిలో స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా కేంద్ర స‌ర్కార్ ఆధీనంలోని పోస్టాఫీసుల్లో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ(India Post Jobs) చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఏకంగా 98,000 పోస్టుల‌ను ఎంపిక చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు అధికారికంగా పోస్ట‌ల్ శాఖ నోటిఫికేష‌న్ ను జారీ చేసింది. ఆస‌క్తి, అనుభ‌వం, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది.

ఇప్ప‌టికే నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ర‌కంగా తీపి క‌బురు చెప్పింది పోస్టాఫీస్ శాఖ‌. దేశంలోని 23 స‌ర్కిళ్ల‌లో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాలను నింప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పోస్ట్ మ్యాన్ , మెయిన్ గార్డ్ , మల్టీ టాస్కింగ్ పోస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

పోస్ట్ మెన్ ఉద్యోగాలు 59,099, మెయిల్ గార్డ్ పోస్టులు 1445, ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్ లైన్ లో అప్లికేష‌న్స్ తీసుకుంటారు. జ‌న‌వ‌రిలో రాత ప‌రీక్ష చేపడ‌తారు. రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ‌ను ఆధారంగా భ‌ర్తీ చేస్తారు. తెలంగాణ స‌ర్కిల్ లో 2513 పోస్టులు ఉన్నాయి. 1553 పోస్ట్ మెన్ జాబ్స్ , 82 మెయిల్ గార్డ్ పోస్టులు, 878 ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి.

Also Read : ఉద్యోగుల‌కు నో ఫుడ్ నో వైఫై – ఎలాన్ మ‌స్క్

Leave A Reply

Your Email Id will not be published!