India Protest : మణిపూర్ హింసకు మోదీదే బాధ్యత
నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు
India Protest : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు ప్రధాన బాధ్యత వహించాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనేనంటూ స్పష్టం చేశాయి ప్రతిపక్షాలు. సోమవారం పార్లమెంట్ భవనం ముందు ప్రతిపక్షాల ఆధ్వర్యంలోని ఇండియా కూటమి.
26 పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు పాల్గొన్నారు. ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. గత మే 3వ తేదీ నుంచి మణిపూర్(Manipur) రాష్ట్రంలో అల్లర్లతో, హింసతో, అత్యాచారాలు, హత్యలతో అట్టుడుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
India Protest Manipur
ఇంత జరుగుతున్నా కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో, కులం పేరుతో, జాతుల పేరుతో, విద్వేషాల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.
మణిపూర్ లో చోటు చేసుకున్న హింసా కాండపై వివరణాత్మక ప్రకటన చేయాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మణిపూర్ లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులుగా మారారు. 10 వేల మందికి పైగా సైనిక బలగాలు ఇంకా పర్యవేక్షిస్తున్నాయి.
Also Read : YS Sharmila : సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ మోసం