Covid19 Cases : కరోనా కేసులతో పరేషాన్
10,753 కేసులు 27 మరణాలు
Covid19 Cases : గత వారం రోజుల నుంచి దేశంలో కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. వందల్లో ఉన్న కేసులు రాను రాను వేలకు పెరిగింది. తాజాగా దేశంలో కొత్తగా 10,753 కేసులు నమోదు కాగా 27 మంది కరోనా(Covid19 Cases) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చని పోయిన వారితో కలుపుకుంటే ఇప్పటి దాకా దేశంలో 5,31,091కి చేరుకుంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,48,08,022 కు చేరుకుంది. మొత్తం 4.48 కోట్లుగా నమోదయ్యాయి.
యాక్టివ్ ఇన్ ఫెక్షన్ కేసుల సంఖ్య 53,720కి చేరుకుదని కేంద్ర ఆరోగ్య , కుటుంబ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇక కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో నలుగురు, రాజస్థాన్ లో మూడు, ఛత్తీస్ గడ్ , గుజరాత్, హర్యానా, హిమాచాల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్ , మధ్య ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , యూపీలలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు.
ఇక రోజూ వారీ పాజిటివిటీ రేటు 6.78 వద్ద నమోదైంది. వారానికి అనుకూల త రేటు 4.49 వద్ద నిలిచింది. యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ ఫెక్షన్లలో 0.12 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.69 వద్ద నమోదైంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసుల(Covid19 Cases) తీవ్రత పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అర్ట్ చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
Also Read : జపాన్ పీఎంపై బాంబు దాడి