Covid19 Updates : దేశంలో 2,380 కేసులు 15 మ‌ర‌ణాలు

కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్తం

Covid19 Updates : నిన్న‌టి దాకా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా ఉన్న‌ట్టుండి పెరిగింది. గ‌త 12 రోజులుగా వ‌రుస‌గా కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2,380 కేసులు న‌మోదుకాగా 15 మంది క‌రోనా(Covid19 Updates)  కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లుపుకుంటే దేశంలో ఇప్ప‌టి దాకా 4,49,69,630 కేసులకు చేరింది. ఇక 15 మ‌ర‌ణాల‌తో చ‌ని పోయిన వారి సంఖ్య 5,31,659కి చేరుకుంది.

కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్ర‌కారం ఆదివారం కొత్తగా కేసులు న‌మోద‌య్యాయి. కాగా క్రియాశీల కేసుల సంఖ్య ముందు రోజు 30,041 నుండి 27,212కి త‌గ్గింది. క‌రోనా ఇన్ఫెక్ష‌న్ల‌ల‌లో 0.06 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా న‌మోదైంద‌ని మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

క‌రోనా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,40,10,738కి చేరుకోగా కేసు మ‌ర‌ణాల రేటు 1.18 శాంతంగా ఉంది. కుటుంబ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం దేశ వ్యాప్తంగా క‌రోనా తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు గాను చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టి దాకా 220 కోట్లకు చేరుకున్నాయ‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా క‌రోనా తీవ్రత‌ను గ‌మ‌నించిన కేంద్ర స‌ర్కార్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో స‌మీక్ష చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

Also Read : రాజ‌స్థాన్ హైద‌రాబాద్ నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!