Covid19 Updates : భారత దేశంలో కరోనా తీవ్రత మెల మెల్లగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మౌలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత 11 రోజుల నుంచి 5 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,382 కరోనా కేసులు(Covid19 Updates) నమోదు కావడం విశేషం. ఇక కరోనా వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కొత్తగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పటి వరకు దేశంలో 5,31,547కి పెరిగింది. ఇందులో కేరళలో 6 మంది ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్యా పరంగా చూస్తే 47,246గా ఉంది. ఇప్పటి వరకు 5,874 వైరస్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 49,015 గా ఉంది.
సోమవారం నమోదైన రోజూ వారీ సానుకూలత రేటు 4.92 శాతం కాగా వారాంతపు పాజిటివిటీ రేటు 4.00 శాతంగా ఉంది. మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. అంటే 4,49,49,671గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్ లలో 0.11 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది.
Also Read : మరాఠా దినోత్సవం మోదీ సందేశం