Covid-19 : నిన్న మొన్నటి దాకా తగ్గుముఖం పట్టిన మహమ్మారి కరోనా(Covid-19) ఉన్నట్టుండి విజృంభించింది. గత రెండు రోజులుగా కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కరోనా కాటుకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో 16,561 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా దెబ్బకు మరణించిన వారి సంఖ్య 5,26,928కి చేరుకుంది. కేసుల పరంగా చూస్తే 1,23,535గా ఉన్నాయి.
ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య చూస్తే 4,42,23,557కి చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కసారిగా 49 మంది కరోనా కారణంగా చని పోవడంతో అప్రమత్తమైంది కేంద్రం.
ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది.
మాస్క్ ధరించక పోతే తీవ్ర చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా 1,23,535 క్రియాశీలక కేసులు నమోదు అయ్యాయి.
18,053 మంది కరోనా వ్యాధి(Covid-19) నుంచి కోలుకున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,35,73,094కి పెరగడం గమనార్హం.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. ప్రతి ఒక్కరు మూడో డోసు వేసు కోవాలని సూచించింది.
Also Read : అమ్మకానికి ‘హిందూస్థాన్ జింక్’ రెడీ