India Slams : పాక్ ప్రధాని కామెంట్స్ పై భారత్ ఫైర్
మేం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయం
India Slams : కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీష్ నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది భారత్(India Slams). శాంతిని కోరే దేశం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయదని స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితిలోని భారత్ మిషన్ మొదటి కార్యదర్శి మిజితో వినోటో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ పీఎం చేసిన వాదనలు పూర్తిగా అబద్దమని మండిపడ్డారు.
ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదంలో మునిగి పోయిందంటూ ఆరోపించారు. కశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడాన్ని తప్పు పట్టారు. భారత్ పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రతిసారీ షెహబాబ్ షరీఫ్ ప్రయత్నం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు.
ఐక్య రాజ్య సమితి అత్యున్నత వేదికపై మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు మిజితో వినోటో. తన దేశంలో జరుగుతున్న దుశ్చర్యలను మరుగున పరిచేందుకు ప్రపంచం ఆమోద యోగ్యంగా లేదని స్పష్టం చేశారు.
భారత దేశం ఎప్పుడూ యుద్దానికి దిగదని ఇదే సమయంలో ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయదని చెప్పారు. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మిజిటో వినిటో.
శాంతిని కోరుకునే దేశం 1993 ముంబై బాంబు పేలుళ్ల కుట్రదారులకు ఎప్పటికీ ఆశ్రయం ఇవ్వదని స్పష్టం చేశారు. తాము పొరుగు దేశాలతో సత్ సంబంధాలు కోరుకుంటామని కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదన్నారు.
ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణాన్ని తాము కోరుకుంటామని కానీ టెర్రరిజాన్ని కాదన్నారు మిజితో వినోటో. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంతో కూరుకు పోయిందన్నారు.
Also Read : మోదీని ఆకాశానికి ఎత్తేసిన ఇమ్రాన్ ఖాన్