Indian Flights : ఉక్రెయిన్ పై ఏకధాటిగా రష్యా దాడులకు దిగుతుండడంతో భారతీయులు చాలా మంది అక్కడే చిక్కుకు పోయారు. ప్రత్యేకించి చదువుకునేందుకు వెళ్లిన 20 వేల మందికి పైగా విద్యార్థులు కూడా లబోదిబోమంటున్నారు.
ఇబ్బందులు పడుతున్న వారందరినీ క్షేమంగా తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. విదేశీ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
ఇందులో భాగంగానే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా చీఫ్ పుతిన్ తో నిన్న రాత్రి మాట్లాడారు. యుద్దాన్ని నిలిపి వేయాలని, నాటో ద్వారా సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరారు.
ఇదిలా ఉండగా తమ వారిని సురక్షితంగా తీసుకు వచ్చేందుకు సహకరించాలని సూచించారు. పుతిన్ సైతం అందుకు అంగీకారం తెలిపారు. ఇక భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు రొమేనియాకు రెండు విమానాలను(Indian Flights) పంపనున్నారు.
ఈ మేరకు పౌర విమానయాన మంత్రి శాఖ స్పష్టం చేసింది. ఏఐ1941 విమానం ముంబై నుంచి ఇవాళ టేకాఫ్ కావాల్సి ఉందని , ఏఐ 1943 విమానం ఢిల్లీ నుంచి సాయంత్ర 4 గంటలకు బయలు దేరుతుందని వెల్లడించింది.
ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా సమకూరుస్తోంది. ఈ రెండు రొమేనియాలో ల్యాండ్ అవుతాయి. అక్కడ ఉక్రెయిన్ ఆధారిత భారతీయులు తిరిగి భారత దేశానికి రానున్నారు.
256 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన డ్రీమ్ లైనర్ విమానాలను మోహరించనున్నారు. రెండు విమానాలలో 500 మంది ఎక్కేందుకు వీలుంది.
పరిస్థితులను బట్టి వారిని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
Also Read : పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ