YS Jagan : ఏపీలో ఎన్నికలు జరిగితే జగన్ దే హవా
ఇండియా టుడే - సీ ఓటర్ సర్వేలో వెల్లడి
YS Jagan : ఏపీలో మరోసారి వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం జేజేలు పట్టడం ఖాయమని, ఇప్పటికిప్పుడు గనుక ఎన్నికలు చేపడితే మరోసారి అధికారంలోకి వస్తారంటూ వెల్లడించింది ఇండియాటుడే – సీ ఓటర్ సర్వే.
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇక ఏపీలో జగన్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోందని తెలిపింది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనకు బ్రహ్మరథం పట్టేలా చేస్తాయని స్పష్టం చేసింది.
టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వైసీపీ దరి దాపుల్లో కూడా లేవని పేర్కొనడం విశేషం. ప్రధానంగా ఎక్కువ శాతం జనం పథకాలు, అభివృద్ధి ఫలాలు, సుపరిపాలన, సామాజిక న్యాయం బాగుందని అభిప్రాయపడ్డారు.
ఏకంగా ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిలో 57 శాతానికి పైగా ఉండడం విశేషం. అంతే కాకుండా దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ఐదుగురు సీఎంలలో జగన్ కూడా ఒకరుగా ఉన్నారని సర్వే తేటతెల్లం చేసింది.
సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తయినా ఇంకా ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని పేర్కొంది. అత్యధిక జనం జగన్ రెడ్డిని(YS Jagan) మరోసారి సీఎం కావాలని కోరుతున్నారు.
ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే చేపట్టాయి. రాజ్ దీప్ సర్దేశాయ్ , రాహుల్ కన్వల్ ల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. 2,41,553 మంది అభిప్రాయాలను తీసుకుంది. 96,676 ముఖాముఖి చర్చించారు.
ఇక టాప్ సీఎంలలో యోగి ఆదిత్యానాథ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ ఉండడం విశేషం.
Also Read : చదువు కోసం ఎంత ఖర్చు కైనా సిద్దం