Thanedar Michigan : భారత్..అమెరికా సంబంధాలు బాగా లేవు
ఇండియా..యుఎస్ లా మేకర్ థానేదార్
Thanedar Michigan : భారతీయ..అమెరికన్ లా మేకర్ థానేదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇండో, యుఎస్ మధ్య బంధాలు అంత బలంగా లేవని అన్నారు. థానేదార్ అమెరికా లోని మిచిగాన్ కు 14వ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా డెట్రాయిట్ , దాని శివారు ప్రాంతాలు ఉన్నాయి. అమెరికా ప్రతినిధుల సభ సభ్యునిగా ఈనెల ప్రారంభంలో ప్రమాణ స్వీకారం చేశారు. తానేదార్ ప్రస్తుత కాంగ్రెస్ లో ఉన్న ఐదవ భారతీయ అమెరికన్ అయ్యాడు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు , వారి ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేదుకు తాను కృషి చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా భారతీయ అమెరికన్లలో డాక్టర్ అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ తో పాటు థానేదార్(Thanedar Michigan) కూడా ఒకరు లా మేకర్స్ లలో . సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం థానేదార్ మీడియాతో మాట్లాడారు. ఇది చారిత్రాత్మకంగా భావిస్తున్నా. భారత్, అమెరికా దేశాల మధ్య ఇంకా బలమైన బంధం ఏర్పడ లేదని అభిప్రాయపడ్డారు.
ఓ వైపు భారత్ ఇంకో వైపు అమెరికా రెండు దేశాలు ప్రపంచంలోనే అత్యంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ జీ20 కి సారథ్యం వహిస్తోందన్నారు. అయినా అమెరికా, యుఎస్ దేశాల మధ్య ఇంకా బంధం బలపడాల్సిన అవసరం ఉందన్నారు థానేదార్.
Also Read : జార్జి ఫెర్నాండెజ్ సోషలిస్ట్ లెజెండ్