Indian Airforce: ఒకే రోజు కూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు

ఒకే రోజు కూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు

Indian Airforce : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు యుద్ధ విమానాలు ఒకే రోజు ప్రమాదానికి గురయ్యాయి. రెండు వేరు వేరు ప్రమాదాల్లో ప్రమాదాల్లో జరిగిన ఈ ఘటనలో యుద్ద విమానాలు కూలిపోగా… అయితే ఈ ఘటనలో పైలెట్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Indian Airforce Planes Crashed

హరియాణాలోని పంచకులలో శుక్రవారం జాగ్వార్‌ యుద్ధ విమానం కూలింది. హరియాణాలోని పంచకులలో వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానానికి అంబాల వైమానిక స్థావరం నుంచి శిక్షణ కోసం బయలుదేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. రోజువారీ ట్రైనింగ్‌ లో భాగంగా ఈ విమానాన్ని ఉపయోగించగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో అప్రమత్తమైన పైలెట్ నివాసాలకు దూరంగా తీసుకెళ్లిన తర్వాత విమానంలో నుంచి ఎజెక్ట్ అయ్యాడు. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. విమానం కూలడానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

హరియాణాలో విమానం కూలిన కొన్ని గంటల్లోనే పశ్చిమబెంగాల్‌(West Bengal) లోని బగ్‌ డోగ్రాలోని బగ్దోరా ఎయిర్‌పోర్టులో ఏఎన్‌-32 విమానం కుప్పకూలింది. ఐఏఎఫ్‌కు చెందిన ఎఎన్-32(AN-32) రవాణా విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే ఘటనా స్థలం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ఘటనలో పైలెట్, సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేసింది. కాగా, భారత వాయుసేన చరిత్రలో ఒకే రోజు ఇలా రెండు విమానాలు కూలడం అసాధారణమైన విషయం. దీన్ని రష్యాలో తయారుచేశారని తెలిపారు.

ఇండియాలో ప్రస్తుతం ఆరు స్క్వాడ్రన్ల జాగ్వర్ విమానాలు ఉన్నాయి. ప్రపంచంలో జాగ్వర్ యుద్ద విమానాలను కేవలం భారత వాయుసేన మాత్రమే ఉపయోగిస్తోంది. ఈ విమానాలను 1979లో యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ తర్వాత సంబంధిత లైసెన్సులు పొంది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. ఇక ఏఎన్-32 రవాణా విమానాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఐఏఎఫ్ వీటికి ప్రత్యామ్నాయాలను వెదికే పనిలో ఉంది. త్వరలోనే ఈ విమానాలను కూడా కొత్త వాటితో రీప్లేస్ చేయనున్నట్లు తెలిసింది.

Also Read : PM Narendra Modi: వంటనూనె వినియోగం తగ్గించి… వ్యాయామం చేయండి – ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!