Neeraj Chopra : రెజ్లర్ల రోదన నీరజ్ చోప్రా ఆవేదన
మహిళా మల్ల యోధులకు మద్దతు
Neeraj Chopra : ప్రముఖ భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల ఆందోళనకు బేషరతుగా మద్దతు ప్రకటించాడు. తాను తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
అథ్లెట్లు దేశం కోసం ఆడతారని , అలాంటి వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేయడం బాధాకరమని పేర్కొన్నారు నీరజ్ చోప్రా. ప్రస్తుతం చోప్రా భారతదేశానికి ఒలింపిక్ లో బంగారు పతకాన్ని తీసుకు వచ్చిన అథ్లెట్ . ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ట్విట్టర్ ను షేక్ చేస్తున్నాయి.
మహిళా రెజ్లర్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) కు వ్యతిరేకంగా గత ఏడు రోజులు నుంచి ఆందోళన చేపట్టారు. ఆయన నుంచి తమకు ప్రాణ భయం ఉందంటూ వాపోయారు. ఆపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ కోర్టుకు ఎక్కారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఖాకీలు కేసు నమోదు చేశారు.
మరో వైపు పీఎం మోదీ, అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విపక్షాలు , ఆటగాళ్లు మండి పడుతున్నారు. పతకాలు సాధిస్తే ప్రచారం చేసుకునే వాళ్లు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను ఎంతగానో కలిచి వేసిందని వాపోయారు.
Also Read : నాదే రాజ్యం నేనే సుప్రీం