India Supports Sri Lanka : క‌ష్టాల్లో ఉన్న శ్రీ‌లంక‌ను ఆదుకుంటాం

స్పీక‌ర్ కు స్ప‌ష్టం చేసిన హై క‌మిష‌న‌ర్

India Supports Sri Lanka : ద్వీప దేశం శ్రీ‌లంక ప్ర‌స్తుతం ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్, విద్యుత్, గ్యాస్, రాజ‌కీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్ప‌టికే దేశ అధ్య‌క్షుడు పారి పోయాడు. సింగ‌పూర్ లో మ‌కాం వేశాడు.

మ‌రో వైపు ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసి భ‌యం భ‌యంతో ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. శ్రీ‌లంక(Sri Lanka) మొత్తం ఇప్పుడు ఆర్మీ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది.

అయితే త్వ‌ర‌గా సంక్షోభం ముగిసేలా అధికార‌, విప‌క్షాలు ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆ దేశ ఆర్మీ చీఫ్ శైవేంద్ర సెల్వా కోరాడు. ఇదే స‌మ‌యంలో జ‌నం రాజ భ‌వ‌నంలోకి చొచ్చుకు వ‌చ్చారు.

పీఎం ఇంటిని ముట్ట‌డించారు. ఆపై వాహ‌నాలు ధ్వంసం చేశారు. ఎట్ట‌కేలకు గోట‌బ‌య రాజ‌ప‌క్సే దిగి వ‌చ్చాడు. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇది స‌మ‌యంలో సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

దేశం స‌ర్వ నాశ‌నం కావ‌డానికి కార‌కులైన రాజ‌ప‌క్సే కుటుంబీకులు ఎవ‌రూ దేశం విడిచి వెళ్ల వ‌ద్దంటూ ఆదేశించింది. ఈ త‌రుణంలో దేశ అధ్య‌క్షుడి ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

వారం రోజుల్లో కొత్త చీఫ్ ను ఎన్నుకోబోతున్నారు. ప్ర‌స్తుతం స్పీక‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తాజాగా శ్రీ‌లంక‌లో ఉన్న భార‌త హై క‌మిష‌న‌ర్ స్పీక‌ర్ ను క‌లిశారు.

క‌ష్టాల్లో ఉన్న శ్రీ‌లంక‌ను భార‌త దేశం(India Supports Sri Lanka) త‌ప్ప‌క ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

లంక‌కు అన్ని విధాలుగా సాయం అందిస్తామ‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడ‌టంలో పార్ల‌మెంట్ పోషించిన పాత్ర‌ను కొనియాడారు హై క‌మిష‌న‌ర్.

Also Read : జ‌వాన్ల‌కు వంద‌నం చిన్నారికి స‌లాం

 

Leave A Reply

Your Email Id will not be published!