Leo Varadkar : ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్
ప్రమాణ స్వీకారం చేయనున్న పీఎం
Leo Varadkar : ప్రవాస భారతీయుల హవా కొనసాగుతోంది. పలువురు అద్భుతమైన ప్రతిభా పాటవాలతో దుమ్ము రేపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమదైన శైలితో రాణిస్తున్నారు. ప్రత్యేక ముద్ర కనబరుస్తూ విస్తు పోయేలా చేస్తున్నారు. ఇప్పటికే టాప్ కంపెనీలను శాసిస్తున్న వారంతా ప్రవాస భారతీయులే కావడం విశేషం.
అంతే కాదు రాజకీయాలలో సైతం రాణిస్తూ దుమ్ము రేపుతున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్దన్న అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా తమిళనాడుకు చెందిన కమలా హారీస్ ఉన్నారు. ఎంతో మంది యుఎస్ లో కొలువు తీరారు. ఇక వైట్ హౌస్ లో అత్యధిక శాతం కీలక పోస్టులలో ప్రవాస భారతీయులే ఉండడం విశేషం.
ఇక ఇటీవలే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ కూడా ప్రవాస భారతీయుడే. ఆయన ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రిగా కొలువు తీరారు. ఇక తాజాగా మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. చరిత్ర సృష్టించారు ప్రవాస భారతీయుడైన లియో వరాద్కర్.
ఆయన రెండోసారి ఐర్లాండ్ దేశానికి ప్రధానంగా ఎన్నిక కావడం. శనివారం దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు 43 ఏళ్లు. అంతకు ముందు లియా వరాద్కర్(Leo Varadkar) 2017 నుండి 2020 వరకు ఐర్లాండ్ కు పీఎంగా పని చేశారు. తన పనితీరుకు లభించిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా లియో వరాద్కర్ స్వస్థలం భారత దేశంలోని మహారాష్ట్ర వరాద్ గ్రామం. ఆయన తండ్రి ఓ వైద్యుడు. 1906లో బ్రిటన్ కు వలస వచ్చారు. ఐర్లాండ్ కు చెందిన మరియంను పెళ్లి చేసుకున్నారు. ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను గే అంటూ ప్రకటించారు. అయితే కరోనా సమయంలో అద్భుతంగా పని చేయడంతో తిరిగి ఆయనకే పట్టం కట్టారు.
Also Read : హక్కులు..స్వేచ్చపై అమితాబ్ కామెంట్స్