Indian Railways: నేటి నుండి అమలులోనికి రైల్వే ఛార్జీల పెంపు

నేటి నుండి అమలులోనికి రైల్వే ఛార్జీల పెంపు

Indian Railways : ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏసీ తరగతుల్లో కిలోమీటరుకు రెండు పైసలు, నాన్‌ ఏసీలో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి రానుందని రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ ఛార్జీలు పెరిగాయి. ఇప్పటికే రిజర్వేషన్‌ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు (Charges Hike) వర్తించవని, జులై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్‌ బుకింగ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిజర్వేషన్‌ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్‌ సర్‌ఛార్జీల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది. కానీ సబర్బన్ రైళ్ల ధరలు మాత్రం యధాతథంగా ఉంటాయి. ఈ మార్పులను అమలు చేయడానికి PRS, UTS, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థలను అప్‌డేట్ చేశారు.

Indian Railways – తత్కాల్‌ కు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి

రైళ్లలో తత్కాల్‌ బెర్తులను తీసుకునేందుకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఆన్‌లైన్లో రిజర్వేషన్‌ చేసుకునేవారికి జులై 1 నుంచి, సాధారణ కౌంటర్లలో తీసుకునేవారికి జులై 15 నుంచి దీనిని వర్తింపజేస్తారు.

పెరిగిన ఛార్జీలు వివరాలు ఇవే

నాన్-ఏసీ తరగతులు (నాన్-సబర్బన్ రైళ్లు)

సెకండ్ క్లాస్:

500 కిలోమీటర్ల వరకు జర్నీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

501-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రూ. 5 పెరుగుదల.

1501-2500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 పెరుగుదల

2501-3000 కిలోమీటర్ల దూరానికి రూ. 15 పెరుగుదల

కిలోమీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు

స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.

ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.

నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

సెకండ్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

ఏసీ తరగతులు (మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు)

ఏసీ చైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2 టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు కిలోమీటరుకు 0.2 పైసలు పెరుగుదల వర్తిస్తుంది. ఈ ధరలు వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, హంసఫర్, అమృత్ భారత్, గతిమాన్, మహమాన, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ, ఏసీ విస్తాడోమ్ కోచ్‌లు, సాధారణ నాన్-సబర్బన్ సర్వీసులకు వర్తిస్తాయి.

అదనపు ఛార్జీలు

రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లు, ఇతర అదనపు ఛార్జీలు మారకుండా ఉంటాయి.

GST నిబంధనలు ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగుతాయి.

ఫేర్ రౌండింగ్ నియమాలు యథాతథంగా ఉంటాయి.

ఈ పెరుగుదల ఎందుకు ?

భారతీయ రైల్వేలు (Indian Railways) దేశంలోని అతి ముఖ్యమైన రవాణా వ్యవస్థలలో ఒకటిగా ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. రైల్వే స్థిరత్వాన్ని కాపాడటానికి, సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ స్వల్ప ధరల పెరుగుదల అవసరమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ధరల సర్దుబాటు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ (IRCA) చేసిన ప్యాసింజర్ టేబుల్ ఆధారంగా జరిగింది.

Also Read : Red Alert: దేశంలో విస్తారంగా వర్షాలు ! 8 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ !

Leave A Reply

Your Email Id will not be published!